జీవీఎంసీలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు.

10/18/2024 1:58:08 AM


విశాఖపట్నం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17: 
 
మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకను గురువారం విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ జీవీఎంసీ అధికారులు ఉద్యోగులతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర మేయరు, జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు  రాష్ట్ర వేడుకగా ఘనంగా జీవీఎంసీలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహర్షి వాల్మీకి బెంగాలీ నెల అశ్విన్‌లో శరదృతువు పౌర్ణమి రోజున బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారని,  సంస్కృత సాహిత్యంలో పేరెన్నిక గల కవి అని, ప్రసిద్ధ హిందూ ఇతిహాసం రామాయణం వెనుక సూత్రధారి అని, సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి కవి 'ఆది కవి' అనే బిరుదును కలిగి ఉన్నారన్నారు. వాల్మీకి మహర్షి శ్లోకమనే నిర్మాణ ప్రక్రియను కనుగొన్న మహా మహర్షి అని వారు కొనియాడారు. జీవీఎంసీలో వారి జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బిపిన్ జైన్, జివిఎంసి అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డి.వి.రమణమూర్తి, ఆర్. సోమనారాయణ ,ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఇ.వాసుదేవ రెడ్డి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ జోనల్ కమిషనర్ ప్రేమ ప్రసన్న వాణి, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఆదినారాయణ, డిపిఓ ఎం .వి. డి.ఫణిరామ్, కార్యదర్శి బి.వి.రమణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అప్పలనాయుడు ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*