బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

10/18/2024 2:12:00 AM


*రిజిస్ట్రేషన్ లేకపోతే కేసు నమోదు చేయాలి

**జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,అక్టోబర్,17: 
బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  బాలల రక్షిత గృహాల నిర్వహణ పై ఆయన సంబంధిత అధికారులు స్వచ్ఛంద సంస్థలుతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. జిల్లాలో 11 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13  బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహించే కేంద్రాల పై కేసు నమోదు చేయాలన్నారు. అనుమతులు లేని బాలల సంరక్షణ కేంద్రాలను తక్షణమే మూయించాలని ఆదేశించారు. వసతీ గృహాలో ఖాళీలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న బాలల సంరక్షణ కేంద్రాలలో ఉన్న బాలలను ప్రభుత్వ వసతీ గృహాలలో చేర్పించాలన్నారు.  వసతీ గృహాల్లో సీట్ల కేటాయింపుకు డిఈఓ, ఐసీడీఎస్ పీడీలతో కమిటీ ఉంటుందని, బాలల కోసం ఫిర్యాదులు వస్తే కమిటీకి తెలియజేయాలన్నారు. సమస్య లేకుండా చూడాలని కమిటిని ఆదేశించారు.  బాలలు రక్షిత గృహాలలో దత్తతకు అర్హులైన బాలల యొక్క వైద్య పరీక్షల నివేదికలు వెంటవెంటనే మహిళా శిశు సంక్షేమ అధికారిణి కి సమర్పించాలన్నారు. ప్రైవేటు వసతీ గృహాలు రిజిస్ట్రేషన్లు డీఈవో వద్ద చేయించుకోవాలన్నారు.  మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి బి. శాంతి శ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థలు బాలల న్యాయ చట్టం ప్రకారం, ప్రభుత్వ నిబంధనలు అనుసరించి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నదని చెప్పారు.  మునగ చెట్లు మహిళలకు ఆరోగ్యానికి తొలిమెట్టు అనే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె. సాయి ప్రత్యూష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. మీనాక్షి, బాలల సంరక్షణ అధికారి కె. రమణ, ఆర్ఐఓ దుర్గారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంక్షేమ అధికారిణి అనురాధ, విద్యా శాఖ ఎడి లియాఖత్ అలీఖాన్, గిరిజన సంక్షేమ శాఖ ఎటిడబ్ల్యూఓ శ్రీనివాసరావు, స్వచ్ఛంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*