పల్లె పండగతో ప‌ల్లెల అభివృద్ధే లక్ష్యం

10/18/2024 2:13:04 AM


*శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్

*ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ చేసిన శాసనసభ్యులు

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,అక్టోబర్ 17: 
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. మండ‌లంలోని కల్లేపల్లి, పీజీపేట, నైర, పొన్నాం, బట్టేరు ప్రాంతాల్లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఎమ్మెల్యే శంకర్ గురువారం శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజలు తమపై పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పల్లె ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఏ గ్రామంలో ఏ పనులు అవసరమో వాటిని పూర్తి చేసేందుకు అందుకు తగ్గ నిధులు కూడా విడుదల చేశామన్నారు. మంచి పాలన అందించడమే పాలకుల లక్ష్యమని అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని శాసనసభ్యులు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెద్దఎత్తున కల్పించేందుకు మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వారం రోజులపాటు నిర్వహించనున్న పల్లె పండుగ వారోత్సవాలను నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. నియోజకవర్గంలో సిసిరోడ్లు, బిటి రోడ్లు, సీసీ డ్రైన్లు, గోకులాలను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో నిర్మిస్తామన్నారు. ఉపాధి నిధులతో నియోజక వర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తామన్నారు. మంచి కార్యక్రమాన్ని రూపు దిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవణ్‌ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమ పాలనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తూ పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా కృషి చేస్తుందని వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*