*మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా
*జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ, కార్యదర్శి, ఆర్. సన్యాసి నాయుడు
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
పాఠశాలలు ఆకస్మిక తనిఖీలు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా, పరిసరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్.సన్యాసి నాయుడు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్.సన్యాసి నాయుడు మండల ప్రజా పరిషత్ పాఠశాల చిలకపాలెం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలకపాలెం, మండల ప్రజా పరిషత్ పాఠశాల ఎచ్చెర్ల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ ఎచ్చెర్ల, పోలీస్ బేరెక్స్ స్కూల్ ఎచ్చెర్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫరీద్ పేట, ఎంపియుపి పాఠశాల కుషాలపురంలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా తీశారు. పాఠశాలల పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. అనంతరం వారికి చట్టాలు పట్ల అవగాహన కల్పిస్తూ తగు పరిష్కరా మార్గాలు వివరించారు.