వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి

10/18/2024 2:18:04 AM


అనకాపల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబరు 17:  
వ్యవసాయ సిబ్బంది ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టరు విజయ క్రిష్ణణ్ తెలిపారు.  గురువారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో పొలంబడి, పొలం పిలుస్తోంది, పి.ఎం.కిసాన్, పకృతివ్యవసాయం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.  
సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, రైతులకు కావలసిన సమాచారం, సహాయం వెంటనే అందించాలన్నారు.  వ్యవసాయ ప్రయోగాలు వలన ఉపయోగాలను  రైతులకు తెలియజేయాలని తెలిపారు.   రైతుల  రిజిస్ట్రేషను, ఇకెవైసీ నూరు శాతం పూర్తిచేయాలన్నారు.  పొలంబడి, పొలం పిలుస్తోంది కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని,  రైతులను భాగస్వామ్యులను చేసి, నూతన సాగు పద్దతులపై అవగాహన, ఆశక్తి కల్పించాలని తెలిపారు.  వరి పంట మినహా మిగిలిన పంటల లక్ష్యాలు పూర్తికావడం లేదని, పప్పుధాన్యాలు, సిరిధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ప్రస్తుతం ఖరీఫ్ పంట సాగుదశలో ఉందని తదుపరి సాగుచేసే రబీ పంటకు కావలసిన ప్రణాళికను  సిద్దంచేసుకోవాలని జిల్లా కలెక్టరు తెలిపారు.  రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని,  ప్రకృతి వ్యవసాయం పై  ప్రచారం కల్పించాలని, ఆయా ఉత్పత్తులకు మార్కెటింగు కల్పించాలన్నారు.   పిఎం కిసాన్ లబ్దిదారుల పరిశీలన, సిసిఆర్ సి కార్డులు పంపిణీ లక్ష్యాలను పూర్తిచేయాలని, మండల స్థాయి నివేదికను  రూపొందించి తరువాత సమావేశానికి అందించాలని ఆదేశించారు. చివంగా పకృతి వ్యవసాయంపై సమాచారం అందించే పుస్తకాన్ని విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహనరావు, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రోజెక్టు మేనేజరు సిహెచ్.లచ్చన్న, వ్యవసాయశాఖ ఎడిఎ, మండల ఎఒలు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*