- ప్రధాని మోదీ..
ఢిల్లీ;
మహారాష్ట్రలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారంలో ముఖ్య నేతలు హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ప్రచారంలోకి దిగారు. ప్రత్యర్దుల పైన గురి పెట్టారు. రెండు కూటముల మధ్య సాగుతున్న ప్రధాన పోరులో గెలుపు కోసం శ్రమిస్తున్నారు. జమిలి ఎన్నికల ప్రచారం వేళ మహారాష్ట్రలో గెలుపు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో, ప్రధాని మోదీ తన ప్రచార ప్రారంభ సభలోనే ఎంవీఏ కూటమి పైన విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర భవిష్యత్ పైన కీలక హామీలు ఇచ్చారు. ప్రధాని మోదీ ధులేలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహా వికాస్ అఘాడీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం కుర్చీ కోసం విపక్ష కూటమిలో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని విమర్శించారు. ఎంవీఏ చక్రాలు, బ్రేకుల్లేని బండిగా పోల్చారు. తప్పుడు పాలన, ప్రజలను దోపిడీ చేయడమే ఆ కూటమి ప్రధాన ఉద్దేశమని అన్నారు. దేశంలోని ప్రజల మధ్య విభజన తేవటమే కాంగ్రెస్ ప్రధాన అజెండా అని మండిపడ్డారు. మతపరమైన సంస్థలతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర దేశ విభజన దిశగా తీసుకెళ్తున్నారంటూ ఆరోపించారు. "రేవంత్ రెడ్డికి అందిన మోదీ సందేశం" ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన వారిని ఒకరి పైకి మరొకరిని రెచ్చగొడుతుందని మోదీ ధ్వజమెత్తారు. ప్రజలంతా ఐకమత్యంతో బలంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐకమత్యమే మహాబలమని చెప్పకొచ్చాని మోదీ...అదే అందర్నీ ఏకతాటిపై ఉంచుతుందని వివరించారు. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రధాని ప్రశంసించారు. తిరిగి ఇదే ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి పనులు ముందుకు దుసుకువెళ్తాయని చెప్పారు. మహాయుతి కూటమిలోని ప్రతి అభ్యర్థికి ప్రజల ఆశీస్సులు కావాలని, గత 2.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని కొనసాగించేందుకు తాను భరోసాగా నిలుస్తానని అన్నారు. Next Stay వచ్చే అయిదేళ్ల కాలంలో మహారాష్ట్రలో అభివృద్ధిని సరికొత్త పుంతలు తొక్కిస్తామని వాగ్దానం చేశారు. మహిళా సాధికారతతోనే 'వికసిత్ భారత్' సాధ్యమని మరోసారి ప్రధాని స్పష్టం చేశారు. మహిళా ప్రగతితోనే సమాజం పురోగమనిస్తుందని, మహిళా సాధికారతకు ఉన్న అవరోధాలన్నీ తాను తొలగించానని, కేంద్ర విజన్‌ను మహాయుతి ప్రభుత్వం పరిపుష్టం చేస్తుందని చెప్పారు. లడ్కీ బహన్ యోజనను ఆపేందుకు విపక్షాలు కోర్టులు కూడా వెళ్లారని, వాళ్లకు అధికారం ఇస్తే ఆ స్కీమ్‌ను ఆపేస్తారని అన్నారు. ఎంవీఏ పట్ల ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.