ఏపీలో అడుగంటిన భావ ప్ర‌క‌న‌ట స్వేచ్ఛ

11/12/2024 9:47:27 PM


- ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన వైసీపీ ఎంపీల బృందం
 
- ఏపీలో దాడులుపై ఫిర్యాదు 

- సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు, అరెస్టులు


న్యూఢిల్లీ, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌, నవంబర్ 12: 
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ అక్రమమంటూ వైసీపీ ఎంపీల (YSRCP MPs) బృందం ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించింది. మంగళవారం జాతీయ మానవ హక్కుల సంఘం యాక్టింగ్ చైర్ పర్సన్ విజయభారతిని వైసీపీ ఎంపీల బృందం కలిసింది. ఏపీలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎంపీలు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్పీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, పోలీసుల చిత్రహింసలపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఎంపీలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని తెలిపారు.

ప్ర‌శ్నించేవారిపై వేధింపులు...

యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని.. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ఎన్‌హెచ్ఆర్సీ విచారణ జరపాలని కోరారు. సోషల్ మీడియా కార్యకర్తలపై సెక్షన్ 111 పెట్టడం ఘోరమన్నారు. మానవహక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి చేశారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని.. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న డీజీపీ పట్టించుకోవడం లేదని తెలిపారు. వెంటనే జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవాలని వైసీపీ ఎంపీల బృందం వినతి చేసింది. ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్‌ను కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ , మేడ రఘునాథ్ రెడ్డి , డాక్టర్ తనూజా రాణి, బాబురావు ఉన్నారు.

Name*
Email*
Comment*