బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్‌లో కేవలం సీనియర్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగాలనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలను వదులుకున్నాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) డైరెక్టర్ మైక్ హెస్సెన్ తెలిపాడు. ఓ సీనియర్ ప్లేయర్‌గా ఈ సమయాన్ని ఆస్వాదించాలని విరాట్ భావిస్తున్నాడని చెప్పాడు. ఐపీఎల్ 2021 సీజన్ ముగింపుతోనే విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ సారథ్యానికి గుడ్ చెప్పిన విషయం తెలిసిందే.దాంతో ఆ జట్టు ఫాఫ్ డుప్లెసిస్‌ను తమ తదుపరి కెప్టెన్‌గా శనివారం బెంగళూరు వేదికగా నిర్వహించిన ఆర్‌సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సూచనల నేపథ్యంలోనే ఫాఫ్ డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని ఈ సందర్భంగా మైక్ హెస్సెన్ తెలిపాడు. జట్టు కోసం కోహ్లీ ఎంతో చేశాడని కొనియాడాడు.