ఏపీలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలాయి

11/29/2024 9:35:50 PM


- ఆగ్ర‌హంతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు
- నాతోపాటు అంద‌రం జ‌నంలోనే ఉందాం
- జిల్లాల‌లో సుడిగాలి ప‌ర్య‌ల‌న‌లోనే ఉంటాం
- సంక్రాంతి నుంచే ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌ట‌న‌లు
- వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

గుంటూరు, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌: 
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో క్రమపద్ధతిలో వ్యవస్థల నిర్వీర్యం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయశారాయన. ‘‘ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మేయర్లందరితో సమావేశం జరుపుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంపీపీలపరంగానూ, జడ్పీటీసీలపరంగానూ, మేయర్ల పరంగా జరిగిన స్ధానిక సంస్దలకు సంబందించిన ఎన్నికల్లో మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 జడ్పీటీసీ స్ధానాల్లో మన పార్టీ గెలిచింది. ఎంపీపీలు, ఎంపీటీసీల స్ధానాల్లో కూడా దేవుడి దయతో గొప్ప విజయాన్ని అందుకున్నాం. ఇవాళ స్ధానిక సంస్ధల్లో ఎక్కడ చూసినా మనమేం కనిపిస్తాం. అయినా జనరల్‌ బాడీ మీటింగ్‌ ఎక్కడ జరిగినా మనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని అన్నారు. మన ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారు. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోందని అన్నారు.

పోరాటంతో మున్ముందుకు వెళ‌దాం...

నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి.  కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్‌ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేశారు. 

సంక్రాంతి నుంచే నా ప‌ర్య‌ట‌న‌...

ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటాను. రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతాను. పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాను. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జనవరిలోగా పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలి. జిల్లాస్ధాయి నుంచి మండల స్ధాయి వరకు పూర్తవ్వాలి. ఆ తర్వాత బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు జరగాలి. గ్రామస్ధాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్‌ బుక్, ఇన్‌స్టా, వాట్సప్‌ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్‌ లోడ్‌ చేయాలి. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నించాలి. సూపర్‌ సిక్స్‌ ఏమైంది? ఏమైంది సూపర్‌ సెవన్‌? అని నిలదీయాలని పిలుపునిచ్చారు. 

స్థానిక క‌మిటీలతో ప‌టిష్టం కావాలి...

నా ప‌ర్య‌ట‌న ప్రారంభించే నాటికే జిల్లా స్ధాయి, నియోజకవర్గస్దాయి నుంచి మండలస్ధాయి వరకు వివిధ విబాగాలకు సంబంధించిన అధ్యక్షులు, అన్ని కమిటీలు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే చెప్పాం. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండలస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు పార్టీ వ్యవస్ధను బలోపేతం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత బూత్‌ కమిటీల నుంచి గ్రామ కమిటీల ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతాం. ఇది ఎంతవరకు వెళ్లాలంటే.. గ్రామస్ధాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఒక ఫేస్‌ బుక్, ఇన్‌స్టా, వాట్సప్‌ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్‌ లోడ్‌ చేయాలి. యూట్యూబ్‌లో కూడా పోస్ట్‌ చేయాలి. సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్‌ రావాలి. అది మనం చేస్తూ, మన కార్యకర్తలతో చేయించాలని సూచించారు. 

అన్నీ బ‌కాయిలే...

 దాదాపు రూ.3,900 కోట్లు కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి సంబందించిన మార్చి నుంచి నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు రూ.2,200 కోట్లు పెండింగ్‌ లో ఉన్నాయి. ఇవాళ పేదవాడు ఆసుపత్రి గడప ఎక్కాలంటే, డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తారన్న నమ్మకం సన్నగిల్లంది.  ఇక ఆరోగ్య ఆసరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడుంది అనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారు. 108, 104 డయల్‌ చేసినా ఆంబులెన్స్‌ వస్తుందన్న పరిస్థితి లేదు. వాళ్లు  నిర‌స‌న‌లు, ధర్నాలు  చేస్తున్నారు. విద్య, వైద్యంతో పాటు చివరకు ధాన్యం కొనుగోలు పరిస్థితి దయనీయంగా ఉంది. దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు. ధాన్యం కొనుగోలుకు ఎంఎస్పీ రూ.1720 అయితే రైతులు కృష్ణా జిల్లాలోనే రూ.300 తక్కువకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేల ద్వారా దళారీల వ్యవస్ధను తీసేసి, ఇ–క్రాప్‌ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టు.. ఈ  ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొనుగోలు చేస్తే.. రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల రైతులు గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఇలా ప్రతి వ్యవస్ధ పూర్తిగా దిగజారిపోయిన పరిస్ధతిలున్నాయి.

క‌ష్టాలు ఎల్ల‌కాలం ఉండ‌వు...

 కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ దైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేక పెరుగుతోంది. ప్రజల తరపున వారికి అండగా నిలవగలిగితే... ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండలస్ధాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే.. ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుందని వివ‌రించారు.

Name*
Email*
Comment*