.ఎక్సగ్రెషియా ప్రకటించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
*నిర్లక్ష్యం వహించిన ఠాగూర్ సంస్థపై చర్యలు తీసుకుంటాం
పరవాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్;
పరవాడ ఫార్మా పరిధిలోని ఠాగూర్ ల్యాబ్ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 40 లక్షల రూపాయలు చొప్పున ఆంధ్ర ప్రదేశ్ కార్మిక,ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎక్సగ్రెసియా ప్రకటించారు. ఈ నెల 26 వ తేదీన సాయంత్రం ఠాగూర్ ల్యాబ్ రేటిస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోని రియాక్టర్ జి ఎల్ 325 వద్ద జరిగిన ప్రమాదంలో హెచ్ సి ఎల్ క్లోరో ఫామ్ లీకేజీ కారణంగా కార్మికులు అస్వస్థకు గురవడం చాలా దురదృష్టం కరం. ప్రమాదంలో గాయపడిన కార్మికులలో ముగ్గురు కిమ్స్ హిస్పిటల్ లో చికిత్స పొందుతూ అదే రోజు ఒకరు మృతి చెందడం.మరొకరు తరువాత మృతి చెందడం విచారకరం.ఘటనపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడం జరిగిందని, కార్మికులకు న్యాయం చేయాలని సంస్థ యాజమాన్యంతో మాట్లాడి 40 లక్షల రూపాయలు చొప్పున ఎక్సగ్రెసియా ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. .ఐ సి యూ ఉన్న మరో కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కానీ మెరుగు పడే అవకాశం ఉంది. మిగిలిన వారు కోలుకోవడం జరుగుతుంది. లీకేజీ ఘటనకు నిర్లక్ష్యం వహించిన సంస్థపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు