.ఎమ్మెల్యే కూన రవికుమార్
ఉద్యోగ మేళాకు మెగా స్పందన
ఆమదాలవలస, వైజాగ్ ఎక్స్ ప్రెస్;నవంబర్ 29 :
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కూన రవి కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఐదు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరయ్యి ఇంటర్వ్యూలు నిర్వహించగా 113 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 32 మందిని వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు కూన రవి కుమార్ మాట్లాడుతూ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని సూచించారు, యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి కల్పించేందుకు నియోజక వర్గంలో ఒక ప్రభుత్వ ఐటిఐ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు, జిల్లాలో రాబోతున్న మూలపేట పోర్టుకు సంబంధించి అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి అవసరమయ్యే మానవ వనరులకు సంబంధించిన శిక్షణలు అందించమని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థను కోరారు. ప్రపంచంలో తొలిసారిగా నైపుణ్య గణన అనే కార్యక్రమం అతి త్వరలో జరగబోతుందని తెలియజేశారు. అనంతరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణను గురించి వివరించారు.