క్రీడా దుస్తుల వితరణ

11/30/2024 8:56:16 PM

వంగర- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30 
అరసాడ గ్రామానికి చెందిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి  లావేటి రాంబాబు  అరసాడ జడ్ పీ హై స్కూలు  విద్యార్థులకు  సుమారు 15000 రూపాయిలు విలువగల క్రీడా దుస్తులు వితరణ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖండాపు జగదీశ్వరీ, ఉపాద్యాయ సిబ్బంది, విద్యార్థులతో పాటు ఎస్ఎంసీ చైర్మన్ అన్నంనాయుడు, ఎంపిటిసి సత్యంనాయుడు, మాజీ సర్పంచ్ ప్రతినిధి కృష్ణమూర్తి, స్థల దాత కడుముల భుజంగరావు, రామారావు మాష్టారు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*