ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
మండలంలో గల జోలపుట్టు పంచాయతీ పోలిపుట్టు గ్రామంలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టాలని స్థానిక సర్పంచ్ దొర నీలకంఠం అన్నారు. పంచాయతీ పరిధి పోలిపుట్టు గ్రామంలో శనివారం ఆయన సందర్శించారు. దీంతో డ్రైనేజీలో కుప్ప కుప్పలుగా పేరుకుపోయిన చెత్తను గమనించి చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ మన ఇంటి చుట్టూ పక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మన ఇంట్లో చెత్తను డ్రైనేజీలో పడేయకుండా ఎక్కడో ఒకచోట కేటాయించి చెత్తను పడేయాలన్నారు. అప్పుడే గ్రామం శుభ్రంగా ఉంటుందని మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉంటామని గ్రామస్తులకు తెలియజేశారు.