ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంగా డిసెంబర్ 4 న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల కేంద్రంలో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో శనివారం సిపిఎం మండల కార్యదర్శి కొర్ర త్రినాథ్, మండల కమిటీ సభ్యులు, వైస్ ఎంపీపీ పి. సత్యనారాయణ, పి. రామదాసు, వి. గణపతి ల ఆధ్వర్యంలో సిపిఎం మహాసభ పోస్టర్లు విడుదల చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి కొర్రా త్రినాధ్ మాట్లాడుతూ నిత్యం సామాన్య ప్రజల బాగు కోసం,గిరిజన ప్రాంతం అభివృది కోసం నిజయితిగా, నిస్వార్ధంగా సిపిఎం పార్టీ పాటుపడుతుందన్నారు. ప్రతి 3 సంవత్సరాల కొకసారి నిర్వహించే పార్టీ జిల్లా మహా సభ ప్రజల సమస్యల పై బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పివిటిజీ తెగల ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, కాఫీ రైతుల బకాయి సొమ్ము, గిట్టుబాటు ధర చెల్లించాలని, జీఓ నెంబర్ 3 రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటీర్ లను,ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగస్థుల ను రెగ్యులర్ చేయాలని, స్కీం వర్కర్లను కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసి వడ్డీలేని రుణాలు ఇవ్వాలని అధికారులకు తెలియజేస్తూ మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా సమగ్ర అభివృధి, ఆదివాసీ హక్కులు, చట్టాలు రక్షణకై చేపట్టే భవిష్యత్తు ఉద్యమానికి నాంది పలకండి అంటూ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 4,5 తేదీలల్లో ఉదయం"10 గం సమయంలో జరిగే బహిరంగ సభ ర్యాలీ నీ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.