జల్ జీవన్ మిషన్ నిధులతో ఇంటింటికి తాగునీటి సౌకర్యం

11/30/2024 9:06:28 PM

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30: 
మండలంలో వనబసింగి పంచాయతీ లుంగాపుట్టు గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మంజూరు చేసిన  జల జీవన్ మిషన్ నిధులతో ఇంటింటికి త్రాగునీటి సౌకర్యం నిర్మాణం పనులు పూర్తవడంతో శనివారం స్థానిక సర్పంచ్ వి. లక్ష్మణ్, ఆధ్వర్యంలో గ్రామ మహిళలతో కలిసి పూజ నిర్వహించి కొబ్బరికాయను కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సౌకర్యం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొనే వారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 7లక్షల 50 వేల రూపాయలు నిధులు మంజూరు కావడంతో 20 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ ను నిర్మించి ప్రతి ఇంటింటికి కుళాయి లను ఏర్పాటు చేశామన్నారు. వీధి కుళాయి నిర్మాణ పనులు పూర్తి కావడంతో ప్రారంభించి ప్రజలకు అందుబాటులో త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ మేరకు త్రాగునీటి సౌకర్యం కల్పించిన స్థానిక సర్పంచ్ గ్రామ మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానికులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Name*
Email*
Comment*