ఎన్ఎడి- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ సిఐ గా గొలగాని అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సాధారణ బదిలీల్లో భాగంగా సోషల్ మీడియా సెల్ (సిఎమ్ ఎస్) నుంచి గోపాలపట్నం కు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన కే సురేష్ ను సోషల్ మీడియా సెల్ (సిఎమ్ ఎస్) చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఎస్సైలు అప్పలనాయుడు, రామకృష్ణ , రామారావు, స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 2002 బ్యాచ్ కు చెందిన అప్పారావు ఎస్సైగా ఆరిలోవ, మల్కాపురం, గోపాలపట్నం పీఎం పాలెం పరిధి పోలీస్ స్టేషన్లో పని చేశారు. సిఐ గా పదోన్నతి పొందిన ఆయన ఏసీబీ ద్వారక, పెందుర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం గోపాలపట్నం సిఐ గా బాధ్యతలు స్వీకరించారు