ప్రజా సంక్షేమానికి పెద్ద పీట

11/30/2024 9:11:51 PM

- పింఛన్లు అందజేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా

మధురవాడ- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30: 
జీవీఎంసీ ఆరవ వార్డు పరిధి రక్షా కాలనీలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక్కరోజు ముందుగానే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లను శనివారం స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిందో దానికి కట్టుబడి పని చేస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రజా రంజక పాలన చేస్తారని పేర్కొన్నారు. పెన్షన్ అందుకున్న వారిలో ప్రతి ఒక్కరిలో నా ఆనందం కనిపిస్తుందని  అవ్వ తాతలు చిరునవ్వు చిందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరవ టిడిపి అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, జనసేన వీరమహిళ పోతిన అనురాధ, నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*