ఎన్ఏడి- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గం 92 వ వార్డు ,పద్మనాభ నగర్ పరిసర కాలనీలలో సామాజిక పింఛన్లను తెల్లవార నుంచి ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా నందవరపు సోములు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాలు లో భాగంగా పెంచిన పెన్షన్లుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కుటుంబాలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. అదేవిధంగా వృద్ధులకు కనీస అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం కలిగిందని అన్నారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో చంద్రబాబునాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అందులో భాగంగా గత నెలలో అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం వసతి , ఉచిత గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి మూడు అందిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, త్వరలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది అని, విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు నందవరపు సోములు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.