ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ

11/30/2024 9:17:05 PM

ఎన్ఏడి- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30: 
 జీవీఎంసీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ, 91, 92, 60వ వార్డులో ఒకరోజు ముందుగానే వృద్ధులకు వితంతులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు అదేవిధంగా తన తనయుడు టిడిపి యువ నాయకుడు మౌర్య సింహ తెల్లవారుజామునే ప్రజల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ప్రతినెల పెన్షన్లు అందుతున్నాయా లేదా అని పేదలని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*