ఆనందపురం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
మండలంలోని వేములవలస ఎంపీపీ పాఠశాలలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ముందస్తుగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అలాగే పిల్లలందరికీ సూచకంగా గులాబీ మొక్కలు అందజేశారు. తను కూడా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ మృదుస్వభావి, మంచి పరిపాలన దక్షుడైన తన ప్రియతమ నేత గంటా శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు. భీమిలి నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే గంటాకు పార్టీలతో పనిలేదని అందర్నీ కలుపుకోయే మంచి మనస్తత్వం ఉందన్నారు. అందుకే ఆయన ఎక్కడ పోటీ చేసిన గెలుపే తప్ప ఓటమి ఎరగని ప్రజానాయకుడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కె. సుభాషిణి, పీవీ ప్రభావతి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.