ఆనందపురం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
మండలంలో ఎల్.వి. పాలెం గ్రామ పంచాయతీలో భీమిలి నియోజవర్గ శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఎల్వి పాలెం పంచాయతీలో పెన్షన్ దారులకు ఒకటో తారీఖున ఆదివారం పడటంతో ఈరోజు ఆయన చేతుల మీదుగా పింఛనీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డాక్టర్ వి. జానకి స్థానిక శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు చేతలు మీదగా పెన్షన్స్ పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ డాక్టర్ వి.జానకి ఈవో పి ఆర్ డి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ పంచాయతీ లోడగల రాజేశ్వరి, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.