పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30 :
గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం (పీపీసీ)ను జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక శని వారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను ఆమె పరిశీలించి గ్రామ వ్యవసాయ సహాయకులకు , రైతు సేవా కేంద్రం సిబ్బందికి ధాన్యం కొనుగోళ్లలో చేపట్టవలసిన అంశాలపై పలు సూచనలు, మార్గదర్శకాలను జారీచేశారు. అదేవిధంగా గరుగుబిల్లి మండలం సుంకి గ్రామంలోని బఫర్ గోడౌన్ ( గొదాము ) ను జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాములో ఉంచిన బస్తాలను రికార్డుల ప్రకారం ఉన్నదీ, లేనిదీ ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్ పాల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.