గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
మండలంలో. ఏ ఎల్ పురం చోద్యం గ్రామాలలో పలు మెడికల్ షాపులను డ్రగ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి, శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా చోద్యం సెంటర్లో ఉన్న వరలక్ష్మి మెడికల్స్ అండ్ క్లినిక్ లో భారీగా శాంపిల్ మెడిసిన్స్ బయట పడ్డాయి. ఆ శాంపిల్ మెడిసిన్ ను సీజ్ చేసి , పూర్తిస్థాయిలో విచారణకు ఇన్స్పెక్టర్ కల్యాణి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు నాశిరకం మందులు అమ్మిన షాపుల్లో బిల్లు ఇవ్వకుండా రోగులకు మందులు విక్రయించినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.