అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్

11/30/2024 10:08:13 PM

యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
 పట్టణంలో శనివారం నాడు అక్రమంగా  మద్యం  సీసాలు తరలిస్తున్నారన్న  సమాచారం మేరకు  గస్తీ నిర్వహించి పాత జాతీయ రహదారి వద్ద కొక్కిరాపల్లి, పెద్దపల్లి గ్రామాలకు  చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.38,862ల విలువ చేసే  254 మద్యం సీసాలు స్వాధీనం  చేసుకుని, వారు ప్రయాణిస్తున్న బైక్ ని సీజ్  చేసి,కేసు నమోదు చేసి, ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లు టౌన్ ఎస్సై సావిత్రి తెలియజేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేకముగా మధ్యం తరలించినా, అమ్మినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. 

Name*
Email*
Comment*