-స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
నర్సీపట్నం మున్సిపాలిటీ,బలిఘట్టం స్మశాన వాటికను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్మశానవాటికలు అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయన్నారు. పార్కులు తరహాలో స్మశాన వాటికలను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. నర్సీపట్నంలో ఉన్న ఐదు స్మశాన వాటికలను పార్కుల్లా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సాయంత్రం వేళల్లో ప్రజలు సేదతీరే విధంగా స్మశానాలను రూపొందిస్తున్నాం అని తెలిపారు. బలిఘట్టం స్మశానవాటిక, అభివృద్ధి కోసం ప్రముఖ సీఎంఆర్ సంస్థ, 20 లక్షలు రూపాయలు విరాళంగా అందజేశారని పేర్కొన్నారు. ఈ నిధులతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. మిగిలిన నాలుగు స్మశానాల, అభివృద్ధి కోసం ఒక సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకొచ్చిందని వివరించారు. వంద పంచాయతీల్లో స్మశానాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్పీకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రమణ, బలిఘట్టం టీడీపీ నాయకులు పాల్గొన్నారు.