ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
ముంచంగిపుట్టు మండలంలో గల దారెల పంచాయతీ కేంద్రానికి చెందిన చెండా సుబ్రహ్మణ్యం (33) అనే గిరిజనయుడు ఉరి వేసుకొని మృతి చెందాడు. ఈ సంఘటనకు గల సంబంధించిన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దారేల గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం మామిడి చెట్టుకు సుబ్రహ్మణ్యం ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీనిని గమనించిన స్థానికులు హుటాహుటిన పరుగులు పెట్టి చూసే సరికి సుబ్రహ్మణ్యం మృతి చెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పోలీసు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతికి గల వివరాలు సేకరించారు. మతి స్థిమితం సరిగ్గా లేక ఇలా చేసుకొని ఉంటాడని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ప్రేమ విఫలమై మానసిక బాధతో ఉరి వేసుకుని ఉంటాడని వాపోయారు. అందరితో మంచిగా ఉంటూ ఇలా చిన్న వయసులోనే సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో దారెల గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై స్థానిక ఎస్సై జె. రామకృష్ణ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివిధ కోణాలు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ సంఘటన సంఘటనతో దారేలా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.