గార- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భద్రత పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని గార మండలం, కళింగపట్నం పంచాయతీ మాజీ సర్పంచ్, జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి తెలిపారు. శనివారం తెల్లవారుజామునే పంచాయతీలో పెద్దపల్లి పేట, చిన్న పల్లిపేట, బిఎఫ్ వి.ఎఫ్ ఆర్ కాలనీ, అగ్రహారం, తాన్సాహెబ్ పేట, శిలగాం, నగరాల పేట గ్రామాలలో వారు భరోసా పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ ఆదేశాలను అనుసరించి ముందస్తుగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ కిలగు. అప్పలనాయుడు (శ్రీధర్ రెడ్డి) టిడిపి పార్టీ నాయకులు వైకుంఠ రావు, తాళ్లూరి శివ నరసింహ ప్రసాద్ మాస్టారు, మజ్జి రమణ, మందుల అన్నాజీ రావు ప్రశాంత ఉపాధ్యాయులు బివి నారాయణరావు,మజ్జి సింహాద్రి ,కి లగు. రాజశేఖర్, కేవీయన్ రెడ్డి ,సచివాలయ సెక్రెటరీ బి. రాజు, లోకేష్, అంగన్వాడి వర్కర్లు, ఆశ వర్కర్లు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.