సోంపేట- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
నెలవారీ ఫించన్ దారులుకు గత ప్రభుత్వం లో నానా ఇబ్బందులు పడ్డారని, కూటమి సర్కార్ అధికారము లోకి వచ్చాక వారి సంక్షేమమే లక్ష్యంగా పింఛన్లు పంపిణీ చేసిందని, పలాస మండల తెలుగు దేశం అధ్యక్షులు కిక్కర ఢిల్లీరావు అన్నారు. శనివారం ఫించన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం పింఛన్ ఏదో ఒక అనివార్య కారణం వలన ఒక నెల పింఛన్ తీసుకోకపోతే వెంటనే తొలిగించడం జరిగిందిని, అటువంటి పింఛన్లు కూటమి ప్రభుత్వం పునరుద్దరణ చేసి గత నెలది కలిపి రూ - 8,000 బొడ్డపాడు గ్రామ వాస్తవ్యులు పోతనపల్లి సావిత్రి వితంతు పింఛన్ అందించారు. ఇందుకు పలాస నియోజకవర్గ శాసన సభ్యురాలు గౌతు శిరీష అక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.