గార- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గార మండలంలో రెండు రోజులుగా మత్స్యకారులు వేటకు దూరంగా ఉన్నారు. మండలంలో బందరువాని పేట, కె మత్స్య లేసం, కొమరువానిపేట, మొ గదలపాడు, శ్రీకూర్మం మత్స్యలేశం, పంచాయతీ పరిధిలోని బోట్లను ఒడ్డుకు చేర్చారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ తుఫాన్ సమయాల్లో వీరి ఆదాయానికి గండి పడటంతో ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు.