మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు

11/30/2024 10:25:02 PM

సోంపేట- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30: 
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని,పలువురు వక్తలు అన్నారు. మత్తు పదార్దాలు నియంత్రణ కోసం శనివారం గ్రీన్ ఆర్మీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనాల గోపాల్,టిడిపి నాయకులు వజ్జ. బాబురావు, బడ్డ. నాగరాజు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు, యువత మత్తు పదార్థాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. వాటిని సేవించడం వల్ల అనారోగ్యం పాలవుతారని చెప్పారు. మత్తు పదార్థాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి పలాస మీదుగా గంజాయి రవాణా చేస్తూ పలువురు నిందితులు పోలీస్ లకు పట్టుబడుతున్న నేపద్యం లో గంజాయి నియాత్రణకు పోలీస్, ఎక్స్చేంజ్ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ముందుగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ పాత బస్టాండ్ వరకు సాగిన ర్యాలీ లో డ్రగ్స్ వాడకాన్ని నిరసిస్తూ నినాదాలతో హారెత్తిoచారు. మత్తు పదార్దాలు కు బానిస కావొద్దని ప్లే కార్డు లతో నిరసన తెలిపారు. మానవహారం చేపట్టారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం ఎస్. బి. ఎస్ వై ఎమ్. కళాశాల విద్యార్థుల మత్తు పదార్దాలు వాడకం వల్ల వచ్చే నష్టాలు పై చేపట్టిన ప్రదర్శన ఆకట్టు కుంది.ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*