ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30
ఇచ్చాపురం పట్టణ పరిధి సురంగి రాజ మైదానం నుండి బహుదా స్మశాన వాటిక వరకు విద్యుత్ దీపాలు లేకపోవడంతో అటుగా వెళ్లే వందలాది మంది ప్రజలు, వాహనదారులు రాత్రిపూట తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లాభాల స్వర్ణమణి అధికారులను కోరారు.శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఎజెండాలో పొందుపరిచిన 11 అంశాలపై చర్చ జరగ్గా పది అంశాలు కౌన్సిల్ ఆమోదం తెలిపి పాత బస్టాండ్ వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ మరమ్మతులకు రూ 3.50 లక్షల కేటాయించడంతో కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం తెలపడంతో ఈ అంశాన్ని రద్దు చేశారు. ముందస్తుగా కౌన్సిలర్ తో సమావేశం నిర్వహించి చర్చించకుండా నేరుగా ఎజెండా ఒకటి రెండు అంశాలలో అభివృద్ధి పనులకు చేసేందుకు సుమారు రూ 2కోట్ల నిధులు కేటాయించి కౌన్సిల్ ఆమోదం కోరడం ఎంతవరకు సమంజసం అని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ లాభాల స్వర్ణమణి అభ్యంతరం వ్యక్తం చేస్తూ డీసెంట్లు అందజేశారు. రోడ్లపై తిరుగుతున్న పశువుల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పట్టుబడిన పశువులను ఉంచేందుకు సంతపేట వద్ద ప్రభుత్వ స్థలంలో రూ. 3.50 లక్షల కేటాయించి షెడ్ నిర్మాణం చేపట్టేందుకు కౌన్సిల్ ఆమోదం కోరగా కౌన్సిల్ సభ్యులు అభ్యంతర వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలం అక్రమ గురవుతుంది వాటి రక్షణ కోసం చుట్టు ప్రహరీ నిర్మించాలని షెడ్డు తర్వాత చూసుకుంటామని కౌన్సిల్ సభ్యులు తెలిపారు. అనంతరం జీరో అవర్ లో కొన్ని విషయాలపై చర్చ జరిగింది. * పురుషోత్తపురం కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, జగనన్న కాలనీలో హ్యాండ్ బోర్ ఏర్పాటు చేయాలని వార్డు కౌన్సిలర్ సుగ్గు ప్రేమ్ కుమార్ కోరారు. * మున్సిపాలిటీ పరిధిలో గల 4, 6, 7, 8 వార్డుల పరిధిలో కాలువల్లో ఉన్న పాత ఐరన్ విద్యుత్ స్తంభాలు ఉండటం వలన వర్షాలు పడితే తరచూ కరెంట్ షాక్ లకు ప్రజలకు గురవుతున్నారు, వెంటనే పాత విద్యుత్ స్తంభాలు తొలగించాలని కౌన్సిలర్లు పి మంజులత, పి మధు మూర్తి అధికారులను కోరారు. వెంటనే తొలగించాలని విద్యుత్ శాఖ ఏఈ గోవిందరావుకు చైర్పర్సన్ ఆదేశించారు. * 8వ వార్డులో అభివృద్ధి పనులకు రూ. ఐదు లక్షల సాధారణ నిధులుకేటాయించారు ఆ నిధులతో సగం పనులు మాత్రమే అవుతున్నాయి. మరో ఐదు లక్షలు నిధులు కేటాయించాలని వార్డు కౌన్సిలర్ అలాంటి మధుమూర్తి అధికారులను కోరారు. కార్యక్రమంలో కమీషనర్ ఎన్ రమేష్, వైస్ చైర్ పర్సన్ లు ఉలాల భారతి దివ్య, లాభాల స్వర్ణమణి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.