సీఎం హామీలు నెరవేరుస్తున్నాం!

11/30/2024 10:35:03 PM

 సోంపేట- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు రాష్ట్రంలో  నేరవేర్చుతున్నామని , ఒకటో తేదీ సెలవు దినం కావడంతో ముందుగానే పించన్లు పంపిణీ చేయడం జరిగిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలం కేదారిపురం గ్రామంలో శనివారం ఆమె పించన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎపి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి. విఠల్ రావు, మత్సకార కార్పొరేషన్ డైరెక్టర్ కుత్తుం లక్ష్మణ్ కుమార్, ఎంపిడిఒ వసంత కుమార్, మండల పంచాయతీ విస్తీర్ణాధికారి మెట్ట వైకుంఠ రావు, ఎపిఎం జాంబవతి, దువ్వాడ సంతోష్ కుమార్, బి. నాగరాజు, వడ్డీ యాదగిరి, ఆళ్ళ కృష్ణారావు, దుర్యోధన, మాజీ ఎంపీటీసీ పాడి నారాయణ, వంకల కూర్మ రావు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*