- నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్
రణస్థలం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
రణస్థలం మండల పరిషత్ కార్యాలయం లో నిర్వహించిన గురజాడ అప్పారావు 109వ వర్ధంతి కార్యక్రమం లో ఎచ్చెర్ల నియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిన్నింటి సాయికుమార్ పాల్గొని వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గురజాడ తెలుగు వారి జాడ అని 100 ఏళ్ల క్రితం సమాజం లో పేరుకుపోయిన మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు, సతీ సహాగమనం వంటి సామాజిక రుగ్మతలపై తన రచనలుతో చైతన్య పరిచిన గొప్ప కవి అని అభివర్ణించారు. ఈ కార్యక్రమం లో మండల వైసీపీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు, ఎంపీడీఓ ఈశ్వరరావు, ఎం ఈ ఓ అట్టాడ త్రినాధ్ రావు, ఈ ఓ పి ర్ డి బలివాడ ప్రకాష్ రావు, ఏ పి ఓ, వెలుగు సిబ్బంది మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.