- ఆ బాటలోనే వెండి ధరలు
- దోబూచులాడుతున్న వైనం
విశాఖ పట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్;
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దోబూచులాడుతున్నాయి. ఒకరోజు ధర పెరిగితే, మరొక రోజు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.700 వృద్ధితో రూ.79,400 పలికింది. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా స్థానిక జ్యువెల్లరీల నుంచి తాజా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బంగారం ధర పెరిగింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.700 పెరిగి రూ.79 వేలు పలికింది. గురువారం తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.78,700 వద్ద స్థిర పడింది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.78,300 పలికింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.1,300 వృద్ధితో రూ. 92,200 వద్ద నిలిచింది. గురువారం రూ.4,900 పతనమై రూ.90,900 లకు పరిమితమైంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ బంగారం తులం ధర రూ.602 వృద్ధి చెంది రూ.76,326లకు చేరుకున్నది. కిలో వెండి కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ ధర రూ.1,049 పుంజుకుని రూ.89,051లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఔన్స్ ధర 20.60 డాలర్లు వృద్ధితో 2,685 డాలర్లకు చేరుకున్నది. ఔన్స్ వెండి ధర 1.94 శాతం పెరిగి 31.15 డాలర్లు పలికింది. ఇన్వెస్టర్లు వచ్చేవారం యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమీక్షపై దృష్టి సారిచారని అబాన్స్ హోల్డింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు.
.............