*బోరుభద్ర-నౌపడ-పూండి వజ్రపుకొత్తూరు జంక్షన్ మీదుగా వెంకటాపురం రోడ్డుకు రూ.167 కోట్లు
*8 వేల ఎకరాల్లో 60 వేల కోట్లుతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్
*రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,సంతబొమ్మాళి 30:
టెక్కలి నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గంలోని వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బోరుభద్ర-నౌపడ-పూండి వజ్రపుకొత్తూరు జంక్షన్ మీదుగా వెంకటాపురం వరకు రహదారి పనులకు రూ.167 కోట్లు వరకు మంజూరు చేస్తునట్లు చెప్పారు. ఈ రహదారిని జాతీయ రహదారిలా తీర్చి దిద్దితే ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో త్రాగడానికి నీరు లేదని, ప్రతీ ఇంటికి నీరందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం ప్రవేశపెట్టిందని, గత ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ఫించన్లు అందిస్తామన్నారు. ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుందని, ఒక నెల, రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెల రూ.12000 లు తీసుకోవచ్చన్నారు. రోడ్డు గుంతలుతో, రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కలు తీసేందుకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయ్యాయని, అన్ని శాఖలుపై సమీక్షిస్తే అన్ని శాఖల పై అప్పులు ఉన్నట్లు గుర్తించామన్నారు. గత ప్రభుత్వం మద్యం షాపులు పై కూడా అప్పులు చేసినట్లు చెప్పారు.
భవిష్యత్తులో వంశధార కాలువలన్నీ సిమెంటుతో లైనింగ్ పనులు చేసి హిరమండలం లో నీరు వదిలితే 24 గంటల్లో మేఘవరం వస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ సహకారంతో నియోజకవర్గంలో సిసి రోడ్ల కోసం దాదాపు 64 కోట్లతో ఉపాధి హామీ నిధులతో చేయనున్నట్లు చెప్పారు. ఉచిత ఇసుక పై సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లితే సీనరేజస్ పూర్తిగా తీసివేసినట్లు వివరించారు. ప్రతీ ఊరిలో మట్టి రోడ్డు లేకుండా సిసి రోడ్లు నిర్మించుకుందామన్నారు. మరిన్ని సిసి రోడ్ల మంజూరు. ఊరి నుండి మండలానికి తారు రోడ్లు ఉండాలని, మండలం నుండి జిల్లాకు డబల్ రోడ్లు ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిని ఆచరణలో చేసి చూపిస్తామన్నారు.
గోతులు లేని రహదారులు ఉండాలని ఇందుకు 70 లక్షల రూపాయలతో బోరుభద్ర నుండి కొల్లిపాడు, లక్కీ వలస ,ఆర్ మేఘవరం, ఎం సున్నా పెళ్లి లింగు జంక్షన్ వరకు రహదారికి మరమ్మతులు శంకుస్థాపన చేశారు. . పండగనాటికి రహదారులు మరమ్మతులు పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. సంతబొమ్మాళి కోటబొమ్మాళి బోరుభద్ర, మూలపేట వరకు డబుల్ లైన్ రోడ్డు వేస్తామని అందుకు గ్రామస్తులు సిద్ధంగా ఉండాలని అచ్చెన్నాయుడు కోరారు.
విశాఖకు ఆరు ఆర్టీసీ బస్సులు ...
ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం కు వయా టెక్కలి మీదుగా ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్తగా ఆరు బస్సులను మంత్రి ప్రారంభించారు. అలాగే టెక్కలి నుంచి వయా బోరుభద్ర విశాఖపట్నం కి వెళ్లేందుకు మరో బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరి ప్రసాద్ ,ధర్మార్జునారెడ్డి ,జీరు భీమారావు ,టెక్కలి ఆర్డిఓ ఎం కృష్ణమూర్తి, ఆర్ అండ్ బి డి ఇ ఇ రవికాంత్,వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే త్రినాధ స్వామి, ఆర్టీసీ టెక్కలి పలాస డిపో మేనేజరలు , వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.