*2వ పట్టణ ఎస్ ఐ రామరావు
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్ 30:
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అవగాహన అవసరం అని 2వ పట్టణ ఎస్ ఐ రామరావు అన్నారు. శనివారం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల లో మాదకద్రవ్యాల నివారణకోసం సంకల్పం, అవగాహనసదస్సు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంకల్పం కార్యక్రమంలో శ్రీకాకుళం రెండవ పట్టణ ఎస్.ఐ రామారావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వి. వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ జి.జి.వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్బం కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం యువత మాదకద్రవ్యాలు బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తెలిసి, తెలియని వయసులో మాదకద్రవ్యాలకు యువత అలవాటుపడటం ద్వారా విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, యువత మాదకద్రవ్యాలు పట్లతగిన జాగ్రత్తతో వ్యవహరించి వాటికి అలవాటుపడకుండా తగినచర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా డైరెక్టర్ బి.యస్.చక్రవర్తి పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ బృందం, ఎన్.యస్.యస్ పిఓ ఎం.నాగభూషణరావు, కళాశాల అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.