టెక్కలి, వైజాగ్ ఎక్స్ ప్రెస్,నవంబర్ 30 :
శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ గా కొరికాన రవికుమార్ డిసెంబర్ 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆనందమయ ఫంక్షన్ హాల్లో గురువారం జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ రవికుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును టెక్కలలో కలసి ఆహ్వానించారు. మంత్రితో పాటు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ లను శనివారం ఉదయం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం తనపై నమ్మకంతో సుడా చైర్మన్ పదవిని ఇచ్చిందని, మంత్రికి రవికుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.