స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్లు జారీ.... అరబిందో ఫార్మా

11/30/2024 10:55:35 PM


రణస్థలం - వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్, 30:         
పంచాయతీ  అరోబిందో ఫార్మా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో  స్కిల్  డెవలప్మెంట్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ఎం.ఎస్సి చదివిన విద్యార్థులకు “ఫార్మాసిటీకాల్  క్వాలిటీ  కంట్రోల్  అనలైటికల్  టెక్నిక్స్” పై ఆరు నెలల శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కాలం ముగిసిన సందర్బంగ 11వ బ్యాచ్ 25  మంది విద్యార్థిని & విద్యార్ధులుకు సర్టిఫికెట్స్ ప్రధానోత్వం కార్యక్రమం జరిగినది.   ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్ యు.ఎన్.బి  రాజు - సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్పొరేటర్ హెచ్ఆర్, డా. రమా శ్రీనివాస్ - అసోసియేట్ ప్రెసిడెంట్ క్వాలిటీ డిపార్ట్మెంట్ చేతులు మీదుగా సర్టిఫికెట్స్  ప్రధానోత్వం చేయబడినది. ఈ ఆరు నెలల శిక్షణలో అనుభవజ్ఞలు అయినా అధ్యాపకులచే, అధునాతన యంత్రలతో  ఫార్మా & కెమికల్స్ కు అవసరమైన శిక్షణ ఇవ్వడమైనది. ఈ ఆరు నెలల శిక్షణ  కార్యక్రమం వలన వివిధ  ఫార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం కలదు అని కమలాకర్ రెడ్డి - సీనియర్ జనరల్ మేనేజర్ –  హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  అపిటోరియా ఫార్మా, అరోబిందో ఫార్మా ఫౌండేషన్ టీమ్ పాల్గున్నారు.

Name*
Email*
Comment*