విశాఖపట్నం - వైజాగ్ ఎక్స్ ప్రెస్, నవంబర్, 30:
గాదిరాజు ప్యాలెస్ లో క్రెడై నిర్వహిస్తున్న 10వ ప్రాపర్టీ ఎక్సపో ను వి ఎం ఆర్ డి ఎ చైర్ పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్ ఈ రోజు సందర్శించారు. అనంతరo మాట్లాడుతూ ఆర్థిక రాజధానిగా విశాఖని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించి ఉన్నారు. అందుకు అనుగుణంగా విశాఖని ఐటీ హబ్ గా అభివృద్ధి చేయటానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు పర్యాటకంగా, అటు పారిశ్రామికంగా కూడా వేగముగా అభివృద్ధి చెందుతున్న మన విశాఖ నగరంలో సొంతింటి కల నెరవేర్చే విధంగా క్రెడై ఇలాంటి ఒక వేదిక నిర్వహించడం చాలా అభినందనీయమని, వి ఎం ఆర్ డి ఎ కూడా ఇక్కడ ఒక చక్కని స్టాల్ ఏర్పాటుచేయడం జరిగిందని, అదేవిధంగా సామాన్య , మధ్య తరగతి వర్గాలకు ఇళ్ళ స్థలాలు అందుబాటులోకి తీసుకువచ్చే సన్నాహాల్లో భాగంగా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్స్ ను అందుబాటు ధరల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో అభివృద్ధి చేస్తోందని, కాబట్టి అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడై కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.