రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

12/12/2024 5:12:54 AM


కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 11:
 కొమరాడ మండలం కోటిపాం రైల్వే గేటు సమీపంలో  రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గత రెండు రోజుల కిందట మతిస్థిమితం లేకుండా ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు స్ధానికులు చెబుతున్నారని  జీఆర్పీ హెచ్.సీ.రత్నకుమార్ అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Name*
Email*
Comment*