'బెల్టు'తీయడం లేదు

12/12/2024 5:37:58 AM

* ఏఎల్ పురం లో పేరుకే వైన్స్ షాపు..
* అక్కడ బార్, బెల్ట్ షాపుల నిర్వహణ 
* పట్టించుకోని ఎక్సైజ్ సిబ్బంది 

గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్,  డిసెంబర్ 10: గొలుగొండ మండలం ఏఎల్ పురం కొంగసింగి రహదారిలో  వెంకటేష్ మద్యం దుకాణం నిర్వాహకులు ఎక్సైజ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇక్కడ విచ్చలవిడి అమ్మకాలతో చుట్టూ ప్రక్కల నివాసితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  పేరు కె వైన్ షాపు కానీ నిర్వాహకులు అక్కడ అంతా బార్ అండ్ రెస్టారెంట్ సదుపాయాలు కల్పించి ఎక్సైజ్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. అంతా మా ఇష్టం మేము ఏ సరుకు తెచ్చి పెడితే ఆ సరుకే  కొనాలి అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారులు అడిగిన ఏ బ్రాండ్ అందుబాటులో లేదని, వారు అమ్మే చీఫ్ నిక్కరే శరణ్యం అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం  అన్ని బ్రాండ్లు ఉంచే విధంగా మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచి, నాణ్యమైన మద్యం అందిస్తామని హామీలు ఇచ్చి, మద్యం దుకాణం నెలకొల్పితే, ఇక్కడ నిర్వాహకులు మాత్రం చుట్టుపక్కల గ్రామాలకు విచ్చలవిడిగా బెల్టు షాపులకు మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాప్ లు విచ్చలవిడిగా ఉన్న సంబంధించిన విభాగం కనీసం కన్నెత్తు చూడటం లేదు. అంతేకాకుండా ఏ ఎల్ పురం షాపు వెనుక సిట్టింగ్ రూములు ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, విక్రయాలు జరుపుతున్నారు. మద్యం దుకాణం ఇరువైపులా చిల్లర దుకాణాలను నెలకొల్పి మందుబాబులు  కావాల్సిన సదుపాయాలు ఉండటం తో ఇక్కడే తాగి  వీరంగం వేస్తున్నట్లు మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే గ్రామంలో చదువుకుంటున్న కొంగ సింగి గ్రామం విద్యార్థులు ఏ ఎల్ పురంలో ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థులు,  జూనియర్ కళాశాల  విద్యార్థులు స్కూలు విడిచిన తర్వాత ఇళ్ల కు వెళ్లే సమయంలో ఆడపిల్లల పట్పల అసభ్యంగా ప్రవర్తించిన పరిస్థితులు ఎదురవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ మార్గంలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో మద్యం కొనడానికి వచ్చిన వినియోగదారులు అందరూ అక్కడే వాహనాలు నిలపడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని  విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని  ప్రజలు కోరుతున్నారు. 

Name*
Email*
Comment*