. సీఎం చంద్రబాబు
విజయవాడ, వైజాగ్ ఎక్స్‌ప్రెస్;
ఐశ్వర్య, ఆరోగ్య, ఆనందాంధ్రప్రదేశ్ (వెల్దీ, హెల్దీ, హ్యాపీ) సాకారమే లక్ష్యంగా ‘స్వర్ణాంధ్ర @ 2047’ విజన్ డాక్యుమెంట్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. ‘పది సూత్రాలు.. ఒక విజన్’ పేరిట డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు.