హైదరాబాద్, సెప్టెంబర్14:
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు ఆహార నాణ్యత పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర జిల్లాల వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించను న్నారు.నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, రంగంలోకి దిగనున్నారు. మంత్రులతో సహ ఐపీఎస్ అధికారు లంతా హాస్టల్ బాట పట్టనున్నారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి,రేపు సంక్షేమ హాస్టల్లో తనిఖీలు నిర్వహించను న్నారు.ఈ సందర్భంగా విద్యార్థులతో సీఎం ముచ్చటించి వారి కోసం వండిన భోజనాన్ని ముందుగా రుచి చూడను న్నారు.
రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని ఏదో ఒక హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిస్థితిని నేరుగా సమీక్షిం చనున్నారు. సీఎం సహా సంక్షేమ హాస్టళ్లలో మంత్రు లు, ఐఏఎస్ అధికారులు వివిధ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు.