2026 నాటికి పోలవరం పూర్తి చేయాలి

12/16/2024 11:32:42 PM



- అధికారులకు చెప్పేసిన సీఎం చంద్రబాబు

పోల‌వ‌రం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌; పోలవరం జాతీయ ప్రాజెక్టును అక్టోబర్ 2026 కల్లా పూర్తి చేయాలని గడువు పెట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ ను వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కోరామన్నారు.  ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు తాజా స్దితిని తెలుసుకునేందుకు  సీఎం చంద్రబాబు సోమ‌వారం పర్యటించారు. ముందుగా హెలికాఫ్టర్ లో వెళ్లి ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే చేసిన ఆయన.. ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. 

వైసీపీ పాపాలే అధికం... 

గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై అధికారుల నుంచి అంచనాలు తీసుకున్న చంద్రబాబు.. అప్పట్లో జరిగిన అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎలా పక్కదోవ పట్టిందో చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. " 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము ఎంత శ్రమించామో గుర్తు చేసుకున్న చంద్రబాబు.. అనంతరం వైసీపీ హయాంలో పనులు ఎలా ఆగిపోయాయో వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వరదలకు డయాఫ్రమ్ వాల్ ఎలా దెబ్బతిందో చంద్రబాబు వెల్లడించారు. అలాగే తమ ప్రభుత్వం తిరిగి రాగానే గత ప్రభుత్వ తప్పిదాల సవరణకు విదేశీ నిపుణులను పిలిపించి ఏయే చర్యలు తీసుకున్నామో తెలిపారు. అనంతరం అధికారులకు ఇచ్చిన గడువు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు ప్రకటించారు.

Name*
Email*
Comment*