విశాఖలో డాక్‌యార్డు ఉద్యోగాల పేరిట భారీ మోసం

12/16/2024 11:34:51 PM


- రూ.80 ల‌క్ష‌ల మేర‌కు వ‌సూళ్లు
- ఓ కానిస్టేబుల్‌తో ఉద్యోగి క‌లిసి మోసం
- ఒక్కో ఉద్యోగి నుంచి రూ.8 ల‌క్ష‌ల వ‌సూలు

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌: విశాఖలో నయా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల రూపాయలను ఏకంగా ఓ పోలీసే కాజేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ నావెల్ డాక్ యార్డ్‌లో ఉద్యోగాలు పేరుతో కంచరపాలెం పీఎస్‌ కానిస్టేబుల్‌ రమణమూర్తి, డాక్‌యార్డు ఉద్యోగి మోహన్‌బాబుతో కలిసి భారీ మోసానికి పాల్పడ్డాడు.⁠ ఒక్కొక్క నిరుద్యోగి వద్ద నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. రమణమూర్తి,మోహన్‌బాబులపై బాధితులు ఫిర్యాదు చేశారు. సుమారు 20 మందికి ఉద్యోగాల ఆశచూపి రూ.80 లక్షల దాకా వసూలు చేసినట్లు చెబుతున్నారు.

Name*
Email*
Comment*