అల్పపీడన ప్రభావం..

12/16/2024 11:36:09 PM


. ఉత్త‌రాంధ్ర‌లో మూడు రోజులు వర్షాలు

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తమిళనాడులో వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  మంగళవారం నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం నెల్లూరు,తిరుపతి,విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. 18వ తేదీన ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Name*
Email*
Comment*