శబరిమల : కేరళలోని పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గాల ద్వారా కాలినడకన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరలోనే ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తెలిపారు. అటవీ మార్గాల ద్వారా ప్రయాణించే భక్తులకు ప్రత్యేక ట్యాగ్ అందిస్తారని, వారు పంబా నుంచి స్వామి అయ్యప్ప రోడ్డు గుండా నేరుగా సన్నిధానానికి చేరుకుంటారని వివరించారు.