*రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
*రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
విశాఖపట్టణం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 17 : రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రక్షాళన చేస్తామని, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖపట్టణం కలెక్టరేట్ విసి హాలులో మంగళవారం రాత్రి జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రీ సర్వే పై గ్రామ సభలు, రెవెన్యూ సదస్సు లు నిర్వహిస్తున్నామన్నారు.
రీ సర్వే పై 6,680 గ్రామాలలో గ్రామ సభలు పెట్టామని ఇప్పటి వరకు రెండు లక్షలు పైగా వినతులు వచ్చాయని,
రీ సర్వే ప్రతిష్టాత్మకంగా చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రీ సర్వే సమస్యలు ప్రత్యేక ప్రణాళిక ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు.
20వ తేదీన కృష్ణాజిల్లాలో నిర్వహించే జోనల్ రెవెన్యూ సదస్సు లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు.
రెవెన్యూ సదస్సులో పంచ గ్రామాలు, 22ఏ సమస్యలు పై సుదీర్ఘంగా చర్చ జరిగిందని, ప్రీ హోల్డ్ పై విచారణ జరిపి అధికారులు తప్పు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. 150 గజాలు లోపు ఉన్న వాటిని క్రమబద్ధీకర చేయాలని అర్జీలు వచ్చాయని,
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి క్రమబద్దీకరణ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
విశాఖ లో 22ఏ లో ఇల్లు ఎక్కువగా ఉన్నాయని వినతులు వచ్చాయని, ప్రత్యేకంగా వీటిపై దృష్టి పెట్టి పరిష్కరనికి కృషి చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం లో అద్భుతమైన రిసర్వే చేస్తామని,త్వరలో పంచగ్రామల సమస్యను పరిష్కరం చేస్తామన్నారు. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి తెలిపారు.
ఈ పత్రికా ప్రతినిధుల సమావేశంలో హోం మంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబు, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి వి జి కుమార్ పాల్గొన్నారు.