ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

12/18/2024 1:54:26 PM

అమరావతి: డిసెంబర్ 18: ఏపీ ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  జనవరి 1వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనం కార్యక్ర మాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారులకు దిశానిర్దేశం చెసినట్లు తెలుస్తోంది.  దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే.  మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహించను న్నారు.

Name*
Email*
Comment*