కానిస్టేబుల్ హాల్ టికెట్ల విడుదల

12/18/2024 2:31:32 PM


అమరావతి, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. స్టేజ్-2 PMT/PET పరీక్షల దేహదారుఢ్య పరీక్షలు హాల్‌టికెట్లు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. డిసెంబర్‌ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహిం చనున్నారు.  ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94414- 50639, 9100203323 ఆఫీసు (ఉ.10-సా.6) సమయంలో ఫోన్‌ నంబర్లను సంప్రదిం చొచ్చు. అలాగే.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఈ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.
అయితే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28వ తేదీన నోటిఫికేషన్‌ విడుద లైంది. అనంతరం 2023 జనవరి 22వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. తర్వాత 2023 ఫిబ్రవరి 5వ తేదీన ప్రిలిమ్స్ ఫలితాలు కూడా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తదుపరి దశకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు.  ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షల్లో పురోగతి లేకుండా పోయింది. అప్పటి నుంచి ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా ఫిజికల్‌ టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు. దాదాపు మూడేళ్లగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ నానుతూనే ఉంది.  దీంతో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం కానిస్టేబుల్‌ నియామక ప్రక్రి య కొనసాగింపు బాధ్యత తీసుకుంది. అయితే పీఎంటీ, పీఈటీ నిర్వహణ తేదీలను కూటమి సర్కార్‌ విడుదల చేసి, షెడ్యూల్‌ కూడా ఖరారు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది

Name*
Email*
Comment*